

శ్రీ మృత్యుంజయ అక్షరమాలా స్తోత్రం శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర |మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ ||అద్రీశజాధీశ విద్రావితాఘౌఘ భద్రాకృతే పాహి మృత్యుంజయ |ఆకాశకేశామరాధీశవంద్య త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ |ఇందూపలేందుప్రభోత్ఫుల్లకుందారవిందాకృతే పాహి మృత్యుంజయ |ఈక్షాహతానంగ దాక్షాయణీనాథ మోక్షాకృతే పాహి మృత్యుంజయ |ఉక్షేశసంచార యక్షేశసన్మిత్ర దక్షార్చిత పాహి మృత్యుంజయ |ఊహాపథాతీతమాహాత్మ్యసంయుక్త మోహాంతకా పాహి మృత్యుంజయ |ఋద్ధిప్రదాశేషబుద్ధిప్రతారజ్ఞ సిద్ధేశ్వర పాహి మృత్యుంజయ |ౠపర్వతోత్తుంగశృంగాగ్రసంగాంగహేతో సదా పాహి మృత్యుంజయ |ఌ(లు)ప్తాత్మభక్తౌఘసంఘాతి సంఘాతకారి ప్రహన్…