మానవాళికి కనకధారా స్త్రోత్రం ఓ పెద్ద వరం. దీనిని క్రమంతప్పకుండా నిష్టగా పారాయణం చేస్తే, మీ ఇంట్లో కనక వర్షమే. ముఖ్యంగా ఈ దసరా సమయంలో… దుర్గమ్మకు ఎంతో ప్రీతిపాత్రమైన నవరాత్రుల్లో కనధార స్త్రోత్రం పఠిస్తే ఎన్నో ప్రయోజనాలుంటాయని శాస్త్రాలు చెపుతున్నాయి. జగద్గుర ఆదిశంకరులు భిక్ష కోసం ఒక పేదబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళారట. యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్నఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మహాతల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది. శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే కనకధారా స్తోత్రం. లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం దరిచేరదు, నవరాత్రులలో పఠించినా అధ్బుతమైన ఫలితం ఉంటుంది.
Leave a Reply