Sree Rama Jataka Chakram

Posted by

🙏🌺శ్రీరాముని పుట్టుక సమయంలో గ్రహబలం అద్వితీయం దాన్ని దేవ రహస్యం అనవచ్చు. 🌺🌺

శ్రీరాముడు చైత్ర శుద్ధ నవమినాడు జన్మించాడు. అయిదు గ్రహాలు(గురువు, కుజుడు, రవి, శని, శుక్రుడు) ఉచ్చస్థానాల్లో ఉండగా శ్రీరాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు.సర్వదేవతలకు మాతృమూర్తి అదితీ దేవి. దేవతా శక్తులకు మూలం. ఆ దేవి అధిదేవతగా గల నక్షత్రం పునర్వసు.

🌺ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, దృఢ వ్రతుడు ఇలా ప్రారంభంలోనే ఆ మహనీయుడి 16 గుణాలను వాల్మీకి పేర్కొన్నారు. వాటిని రాముడు ఎక్కడెక్కడ ఎలా ప్రకటించాడో., సన్నివేశాల తార్కాణాలతో అందించేదే రామకథ! భారతజాతి గుండె చప్పుడుగా ‘రామనామం’ మోగుతూనే ఉంది.

ఆస్తిక జన హృదయాల్లో ఆయన దివ్యమంగళ విగ్రహం కొలువై ఉంది.రామ కథా సుధ తరగని జీవనదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంది.. జై శ్రీరామ్. 🌺

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *